మకరందము
సెప్టెంబరు 27, 2023
మకరందము (makarandamu)
అర్థము
(విశేష్యము): పువ్వుల తేనె; మధువు
Meaning
(noun) : nectar; honey of flowers
వాడుక / Usage
పూలలోని మకరందం త్రాగుతూ తుమ్మెదలు ఝంకారాలు చేస్తున్నాయి.మెదడుకు మేత / Food for thought
వ్యధ వలదు, యువతి నిట్టూర్పు ఇక వలదు,
మగవారు ఎప్పటికీ వంచకులే,
ఒక పాదం నీటిలో, మరొకటి ఒడ్డున,
ఒకదానితో స్థిరంగా ఉండరెన్నటికీ.
ఇంక దుఃఖం ఎందుకు, పట్టి ఉంచకు వారిని,
ఆపై నువ్వు ఉల్లాసంగా ఉండు, అందంగా ఆనందంగా ఉండు,
మార్చు నీ బాధల పోకడిని,
సంతోషాల గీతంలోకి సంగీతంలోకి
--మచ్ ఏడో అబౌట్ నతింగ్, విలియమ్ షేక్స్పియర్ (ఏప్రిల్ 26, 1564 - 1616)
Comments
Post a Comment