అక్టోబర్ 03, 2023
జఠరాగ్ని (jaṭhar-āgni)
అర్థము
(విశేష్యము): భోజనం జీర్ణించు అగ్ని
Meaning
(noun) : gastric juice
వాడుక / Usage
భీముని దేహం వజ్రకఠినం కావడం వల్ల పాముల కోరలు విరిగాయి. జఠరాగ్ని బలం వల్ల విషం జీర్ణమయ్యింది.Snakes fangs broke as Bhima's body was hard as a diamond. His digestive power absorbed the poisons.
మెదడుకు మేత / Food for thought
ఏ లేమ పులకింతవే
వెన్నెలా!
ఏ భామ మైపూతవే
తెల్లని నీ వెలుగు వెల్లువల డోలికల
ఉయ్యాల లూగేను వయ్యారి యమున
ఏ సుదతి చిరునవ్వువే
వెన్నెలా!
ఏ మగువ సిగపువ్వువే
తెల్లని నీ వెలుగు వెల్లువల పరుపుపై
పవళించె నరమోడ్పు ముదిత బృందావని!
ఏ కన్నె ఎద మంటవే
వెన్నెలా!
ఏ కాంత తమి పంటవే
తెల్లని నీ వెలుగు వెల్లువల పడగలపై
పిల్లన గ్రోవూదె నల్లని నా సామి!
-- తఃతః
Comments
Post a Comment