సాలప్రాంశుడు

 

అక్టోబర్ 05, 2023

సాలప్రాంశుడు   (sālaprāmṣudu)

    అర్థము

   (విశేష్యము):  పొడుగైన/ఉన్నతమైన శరీరం కలవాడు

   Meaning

   (noun) : tall and well built person

   వాడుక / Usage

    సాలప్రాంశుడు, ఉజ్జ్వల కవచశోభితుడు, సూర్యాగ్ని సదృశ కాంతియుతుడు కర్ణుడు కనిపించాడు.
    He saw Karna - tall, adorned with dazzling armour and radiant as the fire of Sun.

   మెదడుకు మేత / Food for thought

సాగిపోవుటె బ్రతుకు
ఆగిపోవుటె చావు
సాగిపోదలచిన
ఆగరాదిచటెపుడు
ఆగిపోయిన ముందు
సాగనే లేవెపుడు
వేచియుండిన పోను
నోచుకోనే లేవు.
తొలగి తోవెవడిచ్చు
త్రోసుకొని పోవలయు.
బ్రతుకు పోరాటము
పడకు ఆరాటము.
బ్రతకదలచిన పోరు
సుతరాం తప్పదు.
చూపతలచిన జోరు
రేపనుట ఒప్పదు.
-- కాళోజి నారాయణ రావు (సెప్టెంబర్ 9, 1914 - 2002)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి