అక్టోబర్ 20, 2023
కవోష్ణము (kavōshṇamu)
అర్థము
(విశేష్యము): క+ఉష్ణము; కొంచెము వేడి; గోరు వెచ్చ
Meaning
(noun) : slight warmth
వాడుక / Usage
"కవోష్ణ రుధిర జ్వాలలతోటి స్వతంత్ర సమరం నడపండి" Fight for freedom with the flames of warm blood! మెదడుకు మేత / Food for thought
స్వాతంత్ర్యమే మా జన్మహక్కని చాటండి
నిరంకుశంబగు శక్తులనైనా నిర్భయముగా నెదిరించండి
పరుల దాస్యమున బాధలు పొంది
బ్రతికిన చచ్చిన భేదము లేదు..
సంఘములోను ఐక్యతవేగమె
సంఘట పరుపుము శాంతి పథాన
స్వర్గ తుల్యమౌ స్వతంత్ర జ్యోతికి
మాంగల్యపు హారతులిమ్మా!
-- దేశభక్తి గీతం, తోలేటి
Comments
Post a Comment