యూపదారువు

 

అక్టోబర్ 30, 2023

యూపదారువు   (yoopadaruvu)

    అర్థము

   (విశేష్యము):  యజ్ఞమునందు పశువుని కట్టివేసే కొయ్య; యజ్ఞస్తంభము

   Meaning

   (noun) : post to which the sacrificial animal is tied

   వాడుక / Usage

    పూర్వం యజ్ఞంలో యూపదారువు, దానికి కట్టబడిన బలిపశువు ఉండేవి.
    In ancient times sacrificial goat tied to a post was common in Yagnas. 

   మెదడుకు మేత / Food for thought

ఇది మళ్ళా మరొక యుగసంధి. అప్పటివరకూ స్త్రీ అజ్ఞానంవల్ల ప్రతీదాన్నీ 'తన ఖర్మ' అనుకుని సంతృప్తి పడేది. పోతే ఇప్పుడిప్పుడే స్త్రీ కూడా చదవటం ప్రారంభించింది. ఆమె ప్రపంచాన్ని తెలుసుకోవటం ప్రారంభించగానే పురుషుడు తన అసంతృప్తిని రకరకాలుగా ప్రకటించటం ప్రారంభించాడు. స్త్రీ తన దుస్థితిని చదువువల్ల గుర్తించగలిగింది. ఆలోచించటం నేర్చుకుంది. అదే యుగసంధి. ఆ యుగసంధికి ఆమె మొదటితరం ప్రతినిధి అవటం ఆమె దురదృష్టం. అజ్ఞానం ఇచ్చిన సంతృప్తి, మనిషికి జ్ఞానం ఇవ్వదు. ఈ తరంలోంచి వెళ్లి ఆ తరంలో ఇమడలేకపోతోంది ఆమె.

-- ఆనందోబ్రహ్మ (1985), యండమూరి వీరేంద్రనాథ్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి