ఎన

 

నవంబర్ 01, 2023

ఎన   (ena)

    అర్థము

   (విశేష్యము/విశేషణము):  సమానము; పోలిక; సమత్వము; సాటి

   Meaning

   (noun/adj) : equality; equal; a match

   వాడుక / Usage

    ఎనలేని ఆనంద మీ రేయీ. మనకింకరాబోదు ఈ హాయీ.
    Matchless in happiness is this night, this joy is supreme. 

   మెదడుకు మేత / Food for thought

ఎంత అద్భుతంగా నా జీవితంలో ప్రవేశించావు మందాకినీ నువ్వు - ఎంత హఠాత్తుగా వెళ్ళిపోతున్నావు! కాసింత చిరునవ్వు, కాసిని కన్నీళ్లు, ఇదేనా వీడ్కోలు అంటే...కాదు. మందాకిని తనతోనే ఉంటుంది! కొండల్లో ఉరికినా, కోనల్లో నిండినా, ఆకాశ గంగతో హస్తాలు కలిపినా, శంఖాలు పూరించి శంకరాభరణ రాగాలాపకంఠియైనా తనని వీడిపోదు. తనకి స్పూర్తినిస్తూ తనతో పాటే సాగిపోతుంది.

-- ఆనందోబ్రహ్మ (1985), యండమూరి వీరేంద్రనాథ్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి