కొలిమి

 

అక్టోబర్ 31, 2023

కొలిమి   (kolimi)

    అర్థము

   (విశేష్యము):  లోహము కాల్చే అగ్నిగుండం; సంభోగము

   Meaning

   (noun) : fire pit/furnace; forge; sexual union

   వాడుక / Usage

    వెళ్ళేటప్పుడు వెంట కొలిమిలాంటి ఒక సాధనం తీసుకుని ఉంటే విక్రమ్ మళ్ళీ క్రియాశీలమై ఉండేది.
    Vikram would have still been operational if a furnace like device was carried along. 

   మెదడుకు మేత / Food for thought

అపరాహ్న వేళ. వేదోక్త మంత్రాలతో చేసిన హోమం తాలూకా నిప్పుని కుండలో వేసుకుని అతడు ముందుకు నడుస్తున్నాడు. వెనుకే తాతయ్య. ఇంతవరకూ తాతయ్యే ముందు ఉండేవాడు. ఇకనుంచి నువ్వే నడవాలి సుమా అన్న స్థితికి ప్రారంభమది. ఏమీ లేనిది సోమయాజికొక్కడికే! ఏమీ లేకపోవటం పరిపూర్ణమైన విషాదానికి ఉచ్ఛస్థాయి. అది శ్మశాన వైరాగ్యం కాదు. వైరాగ్యం వేరు, వేదాంతం వేరు. ఈ మాములు ప్రపంచాన్ని వదిలి తాతయ్యతో అతడూ పైకి వెళ్ళిపోయాడు. అతడి కన్నుల్లో నీరు కూడా లేదు.చూసేవారికి ఇతడేమి జఢుడా? అన్నట్లు ఉన్నాడు.

-- ఆనందోబ్రహ్మ (1985), యండమూరి వీరేంద్రనాథ్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి