అక్టోబర్ 06, 2023
కూట (kūṭa)
అర్థము
(విశేషణము): బొంకు; కపటము; రహస్యపు పని
Meaning
(adj) : false; fictitious; scheming
వాడుక / Usage
పాండవులు బలవంతులుగనుక కూటనీతితో వారిని కడతేర్చడానికి ప్రయత్నించాలి. Pandavas are strong and hence try to end them deviously.
మెదడుకు మేత / Food for thought
ఆకలి మండిపోతున్నప్పుడు
ఎదుట ఎంతటి మనోహర దృశ్యమున్నా
దగ్ధమై పోవాల్సిందే
ఆకల్ని నిగ్రహిస్తున్న కొద్దీ
కడుపులో పేగుల్ని
కత్తిరిస్తున్న బాధే
ఆకలి
పూటకో దరిద్రున్ని వేపుకు తిని
అది ఉమ్మేసే తొక్కలే
-- రక్తరేఖ, అలిశెట్టి ప్రభాకర్ (జనవరి 12, 1954 - 1993)
Comments
Post a Comment