కడ
నవంబర్ 02, 2023
కడ (kaḍa)
అర్థము
(విశేష్యము): దిక్కు; అంతము; సమీపము
Meaning
(noun) : direction; proximity; distance; end
వాడుక / Usage
"నేనొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి..."
As I stood near a flowering plant and bent it's branch...
As I stood near a flowering plant and bent it's branch...
మెదడుకు మేత / Food for thought
మళ్ళీ ఎప్పుడో...ఎక్కడో - నా మనసు నా వయసుని గెలవగలిగిందన్న నమ్మకం కుదిరాక నా కోరిక పునీతమయ్యాక ఆ వేదాంతపుటంచు చివర, జీవితం పశ్చిమాద్రిన కృంగిపోయే తరుణాన నిన్ను కలుసుకుంటాను. నువ్వు వెలిగించిన చిరుజ్యోతి ఎంత అఖండమై వెలుగుతుందో చూపించటానికి మాత్రమే కలుసుకుంటాను. కృతజ్ఞత తప్ప మరేదీ లేని నిండు మనసుతో నీకు అంజలి అర్పిస్తాను.
-- ఆనందోబ్రహ్మ (1985), యండమూరి వీరేంద్రనాథ్
Comments
Post a Comment