రొక్కము

 

నవంబర్ 21, 2023

రొక్కము   (rokkamu)

    అర్థము

   (విశేష్యము): ధనము; సమూహము

   Meaning

   (noun) : money; crowd

   వాడుక / Usage

   "రొక్కమిచ్చుటకునే ముక్కంటి చెలికాను".
   I am not Shiva's friend, Kubera, to be able to give you money.

   మెదడుకు మేత / Food for thought

    తెన్నేటి హేమలత వంశీకుంజం కథలో కృష్టుడు, గోపకాంత అయిన నీరజ మధ్య ఉన్న బంధాన్ని అలౌకికంగా చిత్రీకరించారు. ప్రేమికుడైన కృష్ణుడికోసం వడలిన వయసులో, ఎండిన వెదురులాంటి శరీరంతో నీరజ ఆయనతో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ ఎదురు చూస్తూ ఉంటుంది. మధుర ఉద్యానవనంలో ఒకప్పుడు కృష్ణుడుతో గడిపిన జ్ఞాపకాలను తలపోస్తూ...  ప్రేమతో ఆర్థ్రమైన హృదయమూ, కన్నీటితో నిండిన కన్నులూ, ఆరాధనతో పరవశమైన బతుకూ వెలలేనివి అన్నావు. ఈ పారిజాత సుమమాలు అపూర్వమైనది. అది వాడిపోక మునుపే వస్తానన్నావు.... కానీ రాలేదు. నన్ను మర్చిపోయావా... అని అసుర సంధ్యలో వంశీకుంజం ఎదుట ఒక్కతే గత జ్ఞాపకాలలోని కృష్ణుడిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది.
-- డా. రవీంద్ర బాబు

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి