మిటారి
నవంబర్ 27, 2023
మిటారి (miṭāri)
అర్థము
(విశేష్యము/విశేషణము): సొగసుకత్తె; మదముగలది; చమత్కారంగా మాట్లాడే అమ్మాయి; ఒయ్యారమైన;
Meaning
(noun/adj) : a belle; pretty woman; attractive; charming
వాడుక / Usage
"ఆగ్రహం కూడా నీ అందాన్ని అతిశయింప చేస్తోంది కోమలి. మరులు రేకెత్తించే వలపు మిటారి. సరసాలు కురిపించే సొగసు జవరాలివి."
Anger is enhancing your beauty, O dainty one! your seductive charm enamours as a mist of love.
Anger is enhancing your beauty, O dainty one! your seductive charm enamours as a mist of love.
మెదడుకు మేత / Food for thought
వ్యాసుడు గొప్పవాడా...వాల్మీకి గొప్పవాడా...అదేం ప్రశ్న? హిమపన్నాగాలు గొప్పవా, గంగా ప్రవాహం గొప్పదా అన్నట్లు ఉంది. దేని గొప్ప దానిదే. ఎవరి గొప్ప వారిదే. వాల్మీకి వర్ణన, ఆ మహాకావ్యంలో అయన పొందు పరిచిన రమణీయత, అందులోని కరుణ, ఆ మానవోద్వేగాలు...మరొకరి కంఠానికిగానీ గంటానికిగానీ అందేవిగావు. దుస్సాధ్యం. కాని - ఒట్టి పాత్రల విషయానికి వస్తే వ్యాసుని విశ్వరూపం ముందు మరే కల్పనా శక్తి కళ్ళు విప్పార్చి నిలవలేదనిపిస్తుంది. అయన ఘనత ముందు మోకరిల్లాలనిపిస్తుంది. మహాభారతం...పంచమ వేదం...వేయి చేతులు రెండై రెండు చేతులు వేయై ఆధునిక మానవుడి కోసమే సిద్ధం చేసిన ఎన్సైక్లోపీడియా.
-- కథలు ఇలాకూడా రాస్తారు, మహమ్మద్ ఖదీర్ బాబు
Comments
Post a Comment