కుంభిని
నవంబర్ 29, 2023
కుంభిని (kumbhini)
అర్థము
(విశేష్యము): భూమి; నేల
Meaning
(noun) : earth; land
వాడుక / Usage
"కలఁ డంభోధిఁ, గలండు గాలిఁ, గలఁ డాకాశంబునం, గుంభినింగలఁ డగ్నిన్".
He is in ocean, he is in air, in space, in earth and in fire.
He is in ocean, he is in air, in space, in earth and in fire.
మెదడుకు మేత / Food for thought
'రచయితగా ఉండకు. రాస్తూ ఉండు' అన్నాడొకాయన. రచయితగా ఉండటం అంటే? అంటే - రచయిత అనే స్టాంప్ వేయించుకుని ఉబుసుపోనట్టుగా అటూ ఇటూ తిరుగుతూ అభిప్రాయాలు చెబుతూ పెద్దరికం వహిస్తూ పీఠాధిపతిగా అవతారమెత్తుతూ ఉత్త రచయితగా ఉండటం. అంతే తప్ప రాస్తూ ఉండటం మాత్రం కాదు. మరి నిజమైన రచయిత ఎవరు? తాను రచయితగా చెలామణి అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుని రాస్తూ ఉండే పనిలో ఉండేవాడు.
-- కథలు ఇలాకూడా రాస్తారు, మహమ్మద్ ఖదీర్ బాబు
Comments
Post a Comment