ఖద్యోత
నవంబర్ 30, 2023
ఖద్యోత (kha-dyōta)
అర్థము
(విశేష్యము): మిణుగురు పురుగు; సూర్యుడు
Meaning
(noun) : firefly; Sun
వాడుక / Usage
"దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం గలఁ".
He is in (all) directions, in the days, in nights, in Sun, in moon and in (Atma) Self .మెదడుకు మేత / Food for thought
ఎదో ఒక స్పాట్కు వెళ్లి కూచుని అక్కడ కనిపించేదంతా వాక్యాల్లోకి తర్జుమా చేయాలి. గుడికి వెళితే....మెట్ల మీద కూచుని కొబ్బరి తింటున్నాడొక పెద్దమనిషి... ఇది ప్లాట్ రికార్డింగ్. కొబ్బరి ముక్క నోట్లో పెట్టుకోడంవల్ల బుగ్గ వచినట్లయ్యి ,మెట్ల మీద కూచుని ఉన్నాడొక పెద్ద మనిషి....పిల్లలు ఆడుకుంటున్నారు...ప్లాట్...లావుగా ఉన్న ఒక పట్టు పావడా పిల్ల బక్కగా ఉన్న ఇంకో ఇద్దరు ముగ్గురు పిల్లల మీద అథారిటీ చెలాయిస్తూ తాను చెప్పిన ఆటే ఆడమని బలవంతం చేస్తూ ఉంది...ప్రసాదం పంచుతున్నాడు పూజారి...ప్లాట్.
-- కథలు ఇలాకూడా రాస్తారు, మహమ్మద్ ఖదీర్ బాబు
Comments
Post a Comment