పటాపంచలు
డిసెంబర్ 04, 2023
పటాపంచలు (paṭāpanchalu)
అర్థము
(విశేష్యము): చెల్లాచెదరు; కకావికలు
Meaning
(noun) : dispersion; annihilation; scattered
వాడుక / Usage
నాయకుల కుట్రలను కుతంత్రాలను పటాపంచలు చేసే ఓటర్లు ఉన్నారా?
Is there an electorate that can annihilate the Machiavellian designs of politicians?మెదడుకు మేత / Food for thought
చాటుమాటుగ చాటు మా సందేశమిదే! వారెవా!
ముసుగు వేసుకుని, మసక చూసుకుని, ముద్దులబేరాలాడాలోయ్!
ముడుపులు మాకే కట్టాలోయ్! మా ఒడుపులు మీరే చూడాలోయ్!
వంటింటి పొయ్యిలో తమ ఇల్లాలు పిల్లిని దాచేసి
సాని కొంపలు జేరు చవటలకు శాస్తి కాగ!
మంచాల మల్లెల కూనిరాగాల
మా పేరు తలచుకుని విటులు భయపడగ!
గుళ్ళో పూజలు చేసే విటుడు ఒళ్లో హారతి పట్టాలోయ్!
ముష్టి ఎత్తుకును యాచకుడైనా ముద్దుల బిచ్చాలడగోయ్!
రాజ్యాలేలే నాయకులైనా రాత్రికి హాజరు కావాలోయ్!
సాని ఇంటికి వల్లకాటికి చేరినవాడిక అంతేనోయ్!
ఖాకీబట్టల కుక్కకాపలా, కన్ను గీటితే చెల్లేనోయ్!
మందో మాకో దంచేటప్పుడు ముందుగ మా జత ఉండాలోయ్!
చూడవచ్చిన కోతిమూకలు కాల్చుకు తినడం మామూలోయ్!
మలినగర్భ ఈ సంఘమాతకు మంత్రసానులం మేమేనోయ్!
-- పూజకు పనికిరాని పువ్వు, వేటూరి (జనవరి 29, 1936 - 2010)
Comments
Post a Comment