మసలు
డిసెంబర్ 15, 2023
మసలు (masalu)
అర్థము
(క్రియ): తిరుగు; విహరించు; సందేహించు; ఆలస్యం చేయడం; నీళ్లు బాగా కాగడం
Meaning
(verb) : wander; hesitate; delay; water boiling
వాడుక / Usage
ఆకాశమంటూ ఈ కొండా శిఖరమ్ము పై మనుజులకు దూరంగా మసలుతున్నావా, ఏడుకొండల సామి!
On this sky high peak, far from humans wandering are you, O lord of Seven hills!
మెదడుకు మేత / Food for thought
మా అమ్మ తుది శ్వాస విడిచిన మంచం మీదే ఇప్పుడు నేను పడుకున్నాను. అదే పరుపు మీద, చిన్నప్పుడు నిద్రబుచ్చడానికి నా మీద కప్పిన అదే నల్లటి దుప్పటి కింద. చిన్న పిల్లగా అమ్మ ప్రక్కనే పడుకున్నాను, నా కోసం ప్రత్యేకంగా అమ్మ చేసిన వడిలో. ఇంకా లయబద్దమైన అమ్మ ఊపిరి నాకు అనుభూతి కలుగుతోంది. ఆ గుండె చప్పుళ్లు, నన్ను నిద్రబుచ్చిన ఆ నిట్టూర్పులు...అమ్మ మరణం యొక్క బాధ నా నరనరాలలో తెలుస్తోంది. ఇక్కడ పడుకుని, ఆ విషయాలను నెమరు వేసుకుంటూ నా ఒంటరితనాన్ని మర్చిపోవాలని ఆశ.
-- పెడ్రో పారామో, యువాన్ రూల్ఫో (మే 16, 1917 - 1986)
Comments
Post a Comment