కంకి

 

డిసెంబర్ 22, 2023

కంకి   (kanki)

    అర్థము

   (విశేష్యము): జొన్న, సజ్జ, రాగి మొదలగు వాటి వెన్ను; గింజల గుత్తి; పశువులకు వచ్చే రోగం

   Meaning

   (noun) : ear/head of corn; type of animal disease 

   వాడుక / Usage

     స్వీట్ కార్న్ తో పోల్చుకుంటే, దేశీ బుట్టా జాతి కంకులతో శరీరానికి మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు కలుగుతుంది.
    Compared to sweetcorn the native maize ear is good for both the environment and body.

   మెదడుకు మేత / Food for thought

     తమ కార్యంబు పరిత్యజించియు పరార్థ ప్రాపకుల్ సజ్జనుల్
     తమ కార్యంబు ఘటించుచున్ పరహితార్థ వ్యాపృతుల్ మధ్యముల్
     తమకై అన్యహితార్థ ఘాతుకజనుల్ దైత్యుల్, వృథాన్యార్థ భం
     గము గావించెడు వారలెవ్వరొ యెఱుంగన్ శక్యమే యేరికిన్?

    (
ఇతరులకు మంచి జరుగుతుందంటే వారికి ఉపకారం చెయ్యడం కోసం అవసరమైతే తమ పనులను కూడా మానుకొనేవారు ఉత్తములు. తమ పనులకు భంగం కలుగకుండా ఇతరుల పనులకు సాయపడేవారు మధ్యములు. తమ పనులు నెరవేరడం కోసం ఇతరుల పనులు చెడగొట్టేవారు రాక్షసులు. తమకు ఎలాంటి ప్రయోజనం లేకపోయినా సరే వేరే వాళ్ళ పనులకు నష్టం కలిగించేవారిని ఏమనాలో ఎవరికి తెలుసు?)

     -- ఏనుగు లక్ష్మణ కవి (~ 18వ శతాబ్దము)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి