తటపటాయించు
డిసెంబర్ 05, 2023
తటపటాయించు (thatapataayinchu)
అర్థము
(క్రియ): ముందు వెనక ఆలోచించు; సందేహించు
Meaning
(verb) : to hesitate
వాడుక / Usage
చల్లటి నీళ్లలో అడుగు పెట్టేముందు క్షణకాలం తటపటాయించాడు.
He hesitated for a brief moment before stepping into the cold water.మెదడుకు మేత / Food for thought
సొగసు చూడ తరమా..
సొగసు చూడ తరమా ఆ ఆ
నీ సొగసు చూడ తరమా ఆ ఆ
నీ సొగసు చూడ తరమా ఆ ఆ
నీ ఆపసోపాలు నీ తీపిశాపాలు
ఎర్రన్ని కోపాలు ఎన్నెన్నో దీపాలు అందమే సుమా
సొగసు చూడ తరామా ...
నీ సొగసు చూడ తరమా ఆ ఆ
అరుగు మీద నిలబడి ... నీ కురులను దువ్వే వేళ
చేజారిన దువ్వెన్నకు బేజారుగ వంగినపుడు
చిరుకోపం చీరకట్టి సిగ్గును చెంగున దాచి
ఫక్కుమన్న చక్కదనం పరుగో పరుగెత్తినపుడు
ఆ సొగసు చూడ తరమా... నీ సొగసు చూడ తరమా ఆ ఆ
పెట్టి పెట్టని ముద్దును .. ఇట్టే విదిలించికొట్టి
గుమ్మెత్తే సోయగాన గుమ్మాలను దాటువేళ
చెంగుపట్టు పట్టి రారమ్మని చెలగాటకు దిగుతుంటే
తడిబారిన కన్నులతొ విడువిడుమంటున్నపుడు
విడువిడుమంటున్నపుడు.. ఆ సొగసు చూడ తరమా..
నీ సొగసు చూడతరమా ఆ.. ఆ
పసిపాపకు పాలిస్తు పరవశించి ఉన్నపుడు
పెదపాపడు పాకివచ్చి.. మరి నాకో అన్నపుడు
మొట్టికాయ వేసి... ఛి పొండి... అన్నపుడు..
నా ఏడుపూ నీ నవ్వులూ.. హరివిల్లై వెలసినపుడు
ఆ సొగసు చూడ తరమా... నీ సొగసు చూడ తరమా ఆ ఆ
సిరిమల్లెలు హరివిల్లపు జడలోతురిమి.. క్షణమే..యుగమై వేచి వేచి
చలిపొంగును చెలికోకలముడిఓ అదిమి ..అలిసీ సొలసీ కన్నులువాచీ
నిట్టూర్పుల నిశిరాత్రిలో నిదరోవుఅందాలతో..
త్యాగరాజ కృతిలో సీతాకృతి గల ఇటువంటి సొగసు చూడ తరమా
నీ సొగసు చూడ తరమా ఆ ఆ
-- మిస్టర్ పెళ్ళాం, వేటూరి (జనవరి 29, 1936 - 2010)
Comments
Post a Comment