ఈవి
డిసెంబర్ 26, 2023
ఈవి (eevi)
అర్థము
(విశేష్యము): ఈయ బడినది; దానము; బహుమానము
Meaning
(noun) : giving liberally; a gift
వాడుక / Usage
సద్గుణాల్లో ఉద్గుణం దాతృత్వం లేదా ఈవి.
Of all good characters the highest is to give liberally.
మెదడుకు మేత / Food for thought
దేశమా! చూసుకో నిన్ను నువ్వు
అంతరంగం అద్దంలో.
నువ్వు పదిలంగా ప్రదర్శించే
చిరునవ్వు వెనక ఎన్ని విషాదవలయాలో.
ఏటా రెండుసార్లెత్తే నీ జెండా వెనక
ఎన్ని అదృశ్య కృపాణాలో.
ఎన్ని సార్లు హైజాక్ చేశారు నీ మానాన్ని!
ఎన్ని సార్లు తూట్లు పొడిచారు నీ సహనాన్ని!
ప్రపంచ విపణి వీధిలో నీ పరువును వేలం
వేసేముందు మాతృదేశమా!
తడిమి చూసుకో మూతపడ్డ
నీ మూడో కన్ను.
-- కాలం అంచు మీద, డా. సి. నారాయణ రెడ్డి (జులై 29, 1931 - 2017)
Comments
Post a Comment