డిసెంబర్ 27, 2023
సమిధ (samidha)
అర్థము
(విశేష్యము): వంట చెరకు; ఇంధనము; బాగా మండునది;
Meaning
(noun) : firewood; wood for sacrificial fire
వాడుక / Usage
నేటి అసత్య యజ్ఞంలో వాస్తవాలే సమిధలు.
At the altar of today's untruths, truth is the sacrificial firewood.
మెదడుకు మేత / Food for thought
ఎదగడానికెందుకురా తొందరా
ఎదర బతుకంతా చిందర వందర
ఎదిగేవో బడిలోను ఎన్నెన్నో చదవాలి
పనికిరాని పాఠాలు బట్టీయం పెట్టాలి
చదవకుంటే పరీక్షలో కాపీలు కొట్టాలి
పట్టుబడితె ఫెయిలైతే బిక్కమొహం వెయ్యాలి
కాలేజీ సీట్లు అగచాట్లురా
అవి కొనడానికి ఉండాలి నోట్లురా
చదువు పూర్తయితే మొదలవ్వును పాట్లురా ..అందుకే...
ఉద్యోగం వేటలోన ఊరంతా తిరగాలి
అడ్డమైనవాళ్లకీ గుడ్మార్నింగ్ కొట్టాలి
ఆమ్యామ్యా అర్పించి హస్తాలు తడపాలి
ఇంటర్వ్యూ అంటూ క్యూ అంటూ
పొద్దంతా నిలవాలి
పిలుపు రాకుంటే నీ ఆశ వేస్టురా
మళ్లా పెట్టాలి ఇంకో దరఖాస్తురా
ఎండమావి నీకెపుడూ దోస్తురా ..అందుకే...
బిఏను చదివి చిన్న బంట్రోతు పనికెళితే
ఎంఏలు అచట ముందు సిద్ధము
నీవు చేయలేవు వాళ్లతో యుద్ధము
బతకలేక బడిపంతులు పని నువ్వు చేసేవో
పదినెల్లదాకా జీతమివ్వరు
నువ్వు బతికావో చచ్చేవో చూడరు
ఈ సంఘంలో ఎదగడమే దండగా
మంచి కాలమొకటి వస్తుంది నిండుగా
అపుడు ఎదగడమే బాలలకు పండగా
అందాకా...
ఎదగడానికెందుకురా తొందరా
ఎదర బతుకంతా చిందర వందర
-- అందాల రాముడు (1973), ఆరుద్ర (ఆగష్టు 31, 1925 - 1998)
Comments
Post a Comment