భాసురము

 

డిసెంబర్ 14, 2023

భాసురము   (bhāsuramu)

    అర్థము

   (విశేష్యము/విశేషణము): పటికపురాయి; ప్రకాశించునది; స్ఫటికము

   Meaning

   (noun/adj) : bright; shining; alum 

   వాడుక / Usage

  గంగా గౌరి హృదయ విహారి, లీలా కల్పిత సంసారి, భళిరే భాసుర బ్రహ్మచారి.
  Pervading the hearts of Ganga & Gauri;  a householder in an illusory play of your own; kudos O shining celibate.

   మెదడుకు మేత / Food for thought

   అక్కడ నాకు ప్రపంచంలో అన్నిటికన్నా ఇష్టమైన చోటు కనపడుతుంది. కలలుకంటూ నేను చిక్కి శల్యమైన చోటు అది. మైదానం మధ్యలో నా గ్రామం తారస పడుతుంది.  డబ్బులు దాచుకునే భరణిలో నిఘుడమైనా జ్ఞాపకాలలాగా చెట్లు, ఆకులు నీడ ఇస్తూ ఉంటాయి. ఎవరైనా ఎందుకు అక్కడ జీవితాంతం ఉండాలని అనుకుంటారో నీకు తెలుస్తుంది. తెలవారు, ఉదయం, మధ్యాన్నం, రాత్రి; అన్నీ ఒకటే, గాలిలోని మార్పులు తప్ప. గాలి అక్కడ వస్తువుల రంగు మార్చేస్తూ ఉంటుంది. జీవితం సాఫీగా సాగిపోతూ ఉంటుంది సన్నటి మందస్వరం లాగా నిశ్శబ్దంగా. స్వచ్ఛమైన జీవితంగా.

-- పెడ్రో పారామో, యువాన్ రూల్ఫో (మే 16, 1917 - 1986)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి