మొలకొలుకులు
డిసెంబర్ 19, 2023
మొలకొలుకులు (molakolukulu)
అర్థము
(విశేష్యము): ఒక రకం బియ్యం/ధాన్యం; నెల్లూరు, రాయలసీమలో పండించే వడ్లు
Meaning
(noun) : a kind of rice grown in Nellore and Rayalaseema
వాడుక / Usage
గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామ రైతులు మొలకొలుకులు వంటి దేశవాళీ వరి విత్తన నిధి ఏర్పాటు చేసారు.
The farmers of Atthota village in Kollipara Mandal of Guntur district have started a seed bank of native rice varieties like MolaKoluku.
మెదడుకు మేత / Food for thought
మకర ముఖాంతరస్థ మగుమానికమున్ బెకలింపవచ్చుఁ బా
యక దలదూర్మి కానికరమైన మహోదధి దాటవచ్చు మ
స్తకమునఁ బూవుదండవలె సర్పమునైన భరింపవచ్చు మ
చ్చిక ఘటియించి మూర్ఖజన చిత్తముఁ దెల్ప నసాధ్య మేరికిన్
(మొసలినోట్లోని రత్నాన్ని బయటకుతీయవచ్చు, నిరంతము పెద్దపెద్ద అలలు ఎగససిపడే సముద్రాన్ని
సైతమూ దాటవచ్చు, పామును సైతము నెత్తిమీద పూలచెండులాగా ధరింపవచ్చు. కాని, మూర్ఖునితో
మాత్రమూ అతని మనసు తెలుసుకొని మసలుకోవటం ఎవరికీ సాధ్యము కాదు.)
-- ఏనుగు లక్ష్మణ కవి (~ 18వ శతాబ్దము)
Comments
Post a Comment