చోళ్లు
డిసెంబర్ 20, 2023
చోళ్లు (chollu)
అర్థము
(విశేష్యము): ఒక రకం చిరు ధాన్యం; రాగులు
Meaning
(noun) : finger millet
వాడుక / Usage
సాధారణంగా చోళ్లను వేరుశెనగ, కంది వంటి పప్పుదినుసులతో పాటు అంతర పంటగా సాగుచేస్తారు.
Finger millet are typically grown as an inter crop along with ground nuts and lentils.
మెదడుకు మేత / Food for thought
విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్
విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుడున్విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లే దిలన్
విద్య నృపాల పూజితము విద్య నేరుంగనివాడు మర్త్యుడే.
(పురుషునికి విద్యయే రూపము. విద్యయె రహస్యముగా దాచి పెట్టబడిన ధనము,విద్యయే సకల
భోగములను,కీర్తిని, సుఖమును కలుగజేయును. విద్యయే గురువువలె అన్నింటిని బోధించును. పరదేశమునందు
చుట్టము వలె సహాయము చేయును. విద్యయే రాజపూజితము. ఇట్టి విద్య లేనివాడు మనషుడే కాదు.)
-- ఏనుగు లక్ష్మణ కవి (~ 18వ శతాబ్దము)
Comments
Post a Comment