ఉర్వటము
జనవరి 01, 2024
ఉర్వటము (urvatamu)
అర్థము
(విశేష్యము): బాగా తిరుగునది - ఏడాది; సంవత్సరము
Meaning
(noun) : year
వాడుక / Usage
దొర్లుతున్నాయి ఉర్వటాలు కానీ లేవు మన రాష్ట్రానికింకా కర్వటాలు. Years are rolling by but alas the state still has no capital city(cities!).
మెదడుకు మేత / Food for thought
ప్రతీ రాత్రి నిన్న నుంచి రేపటికి!
రాత్రి అల సొలసిన మేనులకు సల్లని నిదురుల రేయి!
ప్రతి ఉదయం నిజమైన నూతన సంవత్సరోదయం,
నిఖిలమైన పండగల ఆర్ణవం.
ప్రతి రేత్రి చేయాలి పవిత్ర ధాత్రి
అహము బాసి దీక్షబూని భక్తి శ్రద్ధలతో;
ప్రతి దినం మహోన్నత ముహూర్తమే కన్ను తెరిచి కదిలి పోడానికి
సరికొత్త ఆహ్లాదం ఈ వెచ్చని గాలిలో ఆ పచ్చికపైరులో.
కేవలం ఒక రాత్రి పాత నుంచి కొత్తకి;
కేవలం ఒకే నిద్దర నెలరాజు నుండి సూరీడుకు.
కొత్తదనం కాదా పాతల కలల సాకారం;
ప్రతి ఉషోదయం సరికొత్త యుగానికి ఆకారం.
-- న్యూ ఇయర్స్ మార్నింగ్ (1892), హెలెన్ హంట్ జాక్సన్ (1830 - 1885)
Comments
Post a Comment