సజ్జ

 

డిసెంబర్ 21, 2023

సజ్జ   (sajja)

    అర్థము

   (విశేష్యము): ఒక రకం ధాన్యం; గంటె; బుట్ట; మంచం; పై అంతస్తు; అలంకరణము; కవచము

   Meaning

   (noun) : kind of (pearl) millet; basket; cot; upper floor; adornment; armour 

   వాడుక / Usage

     సజ్జ పంట భూసారం లేక నీటి నిల్వ తక్కువ ఉన్న ప్రాంతాల్లో కూడా సాగు చేయవచ్చు.
     Pearl millet can be cultivated even in areas with less water and nutrients in the soil.

   మెదడుకు మేత / Food for thought

     ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై
     యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్
     ధీరుల్ విఘనిహన్య మానులగుచు ధ్రుత్యున్నతొత్సాహులై
     ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధలల్ గావునన్

     (ఏదైనా పని మొదలు పెట్టినపుడు ఎన్ని అడ్డంకులు ఎదురయినా వెరువక తుదికంటా లక్ష్యం కోసం శ్రమించడమే కార్య సాధకుడి నైజం. అలాంటివారు ఉత్తములు. ఎప్పుడో ఎదురయ్యే అడ్డంకులను తలచుకుని ఏ పనీ చేపట్టనివారు అధములు. ఏదో చెయ్యాలన్న తపనతో మొదలు పెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదురవగానే వదిలేసేవారు మధ్యములు.)

     -- ఏనుగు లక్ష్మణ కవి (~ 18వ శతాబ్దము)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి