హుటాహుటి

 

డిసెంబర్ 08, 2023

హుటాహుటి   (huṭā-huṭi)

    అర్థము

   (విశేష్యము/విశేషణము): వేగము; వేగవంతము; త్వరగా

   Meaning

   (noun/adj) : swiftness; quickly; haste; rapidly

   వాడుక / Usage

   దుర్ఘటనా స్థలికి అగ్నిమాపక దళాలు హుటాహుటిగా చేరుకున్నాయి.
   Fire brigades reached the disaster zone rapidly.

   మెదడుకు మేత / Food for thought

మధువనిలో రాధికవో మధువొలికే గీతికవో
మధురం ఈ జీవనం
మధురం ఈ జవ్వనం
మనోహరం... మనోహరం...
మధువనిలో రాధికనో మదిపలికే గీతికనో
మధురం ఈ జీవనం
మధురం ఈ యవ్వనం
మనోహరం... మనోహరం...

కార్తీకాన కళలే చిలికి వెలిగే జాబిలి
ఎదలో మల్లెల పొదలో వెలిగెను నేడీ జాబిలి
నీలాకాశ వీధుల్లోన వెలిగే సూర్యుడు
వెతలే మాసిన కథలో వెలిగెను నేడీ సూర్యుడు
తొలి తొలి వలపులే...
తొలకరి మెరుపులై...
విరిసే వేళలో... హేళలో... డోలలో...

బృందావనికి మురళీధరుడు ఒకడే కృష్ణుడు
ఎదిగిన బాలిక ఎదగల గోపికకతడే దేవుడు
మధురాపురికి యమునా నదికి ఒకటే రాధిక
మరువై పోయిన మనసున వెలసెను
నేడీ దేవత
వెలుగుల వీణలే...
పలికెను జాణలో...
అది ఏ రాగమో... భావమో... బంధమో..


-- అల్లరి బావ, వేటూరి (జనవరి 29, 1936 - 2010)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి