కంధరము

 

డిసెంబర్ 11, 2023

కంధరము   (kandharamu)

    అర్థము

   (విశేష్యము): మెడ; కంఠము; మబ్బు

   Meaning

   (noun) : neck; throat; cloud

   వాడుక / Usage

  నీలకంథరా దేవా దీనబాంధవా రారా నను గావరా.
   O dark throat-ed Shiva! friend of the suffering! come save me!

   మెదడుకు మేత / Food for thought

   అక్కడ గాలి లేదు; కేవలం ఆగష్టు పగటిలో మండిపోయి మగ్గిపోయి నిశ్చేష్టమైన రాత్రి మాత్రమే ఉంది.  రవ్వంతైనా ఊపిరి ఆడట్లేదు. శ్వాస వదిలిన గాలినే చేతులతో ఒడిసి పట్టుకుని, చేజారి పోయేలోపు తిరిగి ఎగబీల్చాను. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మెలమెల్లగా తక్కువ అవ్వుతూ వచ్చింది...ఆ గాలి ఎంత పల్చబడిందంటే అది నా వేళ్ళ అంచులలోంచి అందకుండా జారిపోయింది. మళ్ళీ ఇంకెప్పటికీ అందకుండా ఆవిరయ్యింది.

-- పెడ్రో పారామో, యువాన్ రూల్ఫో (మే 16, 1917 - 1986)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి