ఎబ్బె
జనవరి 11, 2024
ఎబ్బె (ebbe)
అర్థము
(అవ్యయము): రోతపడినప్పుడు లేక ఏమీ లేదు అని తెలియచేసే మాట
Meaning
(participle/interjection) : to express disgust; fie!
వాడుక / Usage
ఎబ్బె! ఇలాంటి నాయకుల వల్లే మన రాష్టం దిక్కు దివాణం లేకుండా పోయింది. Fie on them! it's because of such leaders that the state is lost in a quagmire.
మెదడుకు మేత / Food for thought
ఊరవతల సందులలో
దుమ్ము కొట్టుకపోయిన పిల్లల కండ్లలోఆరిపోతున్న వెలుగులో
కాలవ వడ్డున ఒంకర దిరిగిన
తుమ్మచెట్టు కొమ్మలోంచి
కాలి మసైపోతున్న పశ్చిమ దిశాగగనంలో
ఒక భయంకర సృష్టిక్రమాన్ని
మానవయత్న వైఫల్యాన్ని
ఊహించికొని వొణికిపోయేవాణ్ణి
– దేవరకొండ బాలగంగాధర్ తిలక్ (ఆగష్టు 1, 1921 - 1966)
Comments
Post a Comment