మేధ్యము
జనవరి 17, 2024
మేధ్యము (mēdhyamu)
అర్థము
(విశేష్యము/విశేషణము): పవిత్రమైనది; పరిశుభ్రమైనది; యజ్ఞమునకు తగినది
Meaning
(noun/adj) : pure; clean; fit for sacrifice/oblation
వాడుక / Usage
ప్రతీ సంసృతిలో ఆహారములకు మేధ్యము అమేధ్యముగా విభజన ఉన్నాయి. Every culture has its own bifurcation of food into pure and impure.
మెదడుకు మేత / Food for thought
విఘ్నేశ్వరుడు వచ్చి విఘ్నాలు తొలగింపు
షణ్ముఖ నాధుడు శాస్త్రాలు వెల్లింప
సాయిబాబా వచ్చి ప్రేమార లాలింప....
బ్రహ్మ దేవుడు వచ్చి వేదాలు వల్లింప
విష్ణు దేవుడు వచ్చి వరములను అందింప
పరమేశ్వరుడు వచ్చి ఆశీర్వదించంగ....
రామచంద్రుడు వచ్చి రక్షణసేయంగ
శ్రీ కృష్ణుడు వచ్చి శుభములను పలుకంగ
శ్రీ వేంకటేశ్వరుడు ఆశీస్సులందింప
ఆంజనేయుడు వచ్చి అభయాలనివ్వంగ
కులదేవతలు వచ్చి కళాకాంతులివ్వంగ
తులసీదాసుడు వచ్చి మంగళము పాడంగ....
భోగి పండ్లను పోయరే ఓ రమణులారా.....
Comments
Post a Comment