సమసిపోవు
జనవరి 24, 2024
సమసిపోవు (samasi-pōvu)
అర్థము
(క్రియ): అలసిపోవు; నశించు; చచ్చు
Meaning
(verb) : worn out; ruined; perish
వాడుక / Usage
కోరికలు తీర్చబడినప్పుడు సమసిపోవు; మరింత ప్రబలంగా తిరిగొస్తాయి. Desires are never satiated; they ask for more.
మెదడుకు మేత / Food for thought
అమృతము కూఁడుకట్టినదొరా! యల దూరపునీలికొండలోఁ
గొమరుమిగుల్ సితాంబుదముకోసల మూసలుపోతు వెన్నెలల్
రమణి యొకింతకోపన పరాఙ్ముఖయైనది; నాకుఁజెప్పుకో
నమరిన దూత యిప్పుడెవడందువురా నిశాపతీ.
(చందురుడా! అల్లంత దూరాన నీలికొండలో, మనోహరమైన తెల్లని మేఘాల పొడుగంతా వెన్నెలలు పరుచుకుని ఉన్న ఈ వేళలో నా ప్రేయసి నాకు పెడముఖమైంది. నా మనసులో మాట చెప్పుకోవడానికి యిప్పుడు దూత యెవరని అంటావు?)
-- శశిదూతము, విశ్వనాథ సత్యనారాయణ (సెప్టెంబర్ 10, 1895 - 1976)
Comments
Post a Comment