ఉన్మత్తము
జనవరి 25, 2024
ఉన్మత్తము (un-mattamu)
అర్థము
(విశేష్యము/విశేషణము): వెర్రెత్తినది; మత్తుగలది; గర్వించినది; ఉమ్మెత్త చెట్టు
Meaning
(adj/noun) : mad; insane; intoxicated
వాడుక / Usage
ఉన్మత్త మూకలకి చట్టం తలవంచితే అరాచకత్వం ప్రబలిపోతుంది. If law becomes helpless in the face of mad crowds lawlessness shall rule.
మెదడుకు మేత / Food for thought
రావోయి బంగారిమామా నీతోటి
రహస్య మొకటున్నదోయీపంటకాలువ ప్రక్క
జంటగా నిలుచుంటె
నీడల్లో మన యీడు
జోడు తెలిశొస్తాది
ఈ వెన్నెల సొలపు
ఈ తెమ్మెరల వలపు
రాత్రి మన సుఖకేళి
రంగరించాలోయి
నీళ్లతూరల వెన్క
నిలుచున్న పాటనే
జలజలల్ విని, గుండె
ఝల్లుమంటున్నాది
ఈనాటి మన వూసు
లేనాటికీ, మనకు,
ఎంత దూరానున్న,
వంతెనల్ కట్టాలి
అవిసె పువ్వులు రెండు
అందకున్నయి నాకు;
తుంచి నా సిగలోన
తురిమి పోదువుగాని
ఏటి పడవసరంగు
పాట గిరికీలలో
చెలికాడ మనసొదల్
కలబోసుకుందాము
జొన్నచేలో, గుబురు
జొంపాలలోగూడ,
సిగ్గేటో మనసులో
చెదరగొడుతున్నాది
-- కొనకళ్ల వెంకటరత్నం (1909 - 1971)
Comments
Post a Comment