ఒప్పులకుప్ప
జనవరి 29, 2024
ఒప్పులకుప్ప (oppulakuppa)
అర్థము
(విశేష్యము): అందాల / మంచి విశేషముల (ఒప్పులు) రాశి/ప్రోగు (కుప్ప); అందగత్తె
Meaning
(noun) : beautiful woman
వాడుక / Usage
దివినున్న రతనాల రాశులు భువిపై మిరుమిట్లుగొలిపే ఆ ఒప్పులకుప్ప ముందు బలాదూరే. The bright stars of the firmament pale in the radiance of the damsel that walks on Earth.
మెదడుకు మేత / Food for thought
आशायाः ये दासास्ते दासाः सर्वलोकस्य।
आशा येषां दासी तेषां दासायते लोकः॥ ఆశాయాః యే దాసాస్తే దాసాః సర్వలోకస్య ।
ఆశా యేషాం దాసీ తేషాం దాసాయతే లోకః ॥ (ఆశకు దాసులైనవారు లోకమునకంతకూ దాసులే; ఆశ ఎవరికి దాసి అవుతుందో వారికి లోకమంతా దాసిభూత మవుతుంది)
-- నారద పురాణము
Comments
Post a Comment