అట్టచెమ్మ

 

జనవరి 30, 2024

అట్టచెమ్మ   (aṭṭa-chemma)

   అర్థము

    (విశేష్యము): నాలుగు గవ్వలతో ఆడే ఆట; బోర్లా పడితే అష్ట (ఎనిమిది), వెలికిలా పడితే నాలుగు

  Meaning

    (noun) : game played with four shells

   వాడుక / Usage

    చిన్నప్పుడు ఎంతమంది చింత గింజలతో అట్టచెమ్మ ఆడుకున్నారు?
    How many of you have played the dice game with chiselled tamarind seeds?

   మెదడుకు మేత / Food for thought

     स्वभावं  न जहात्येव साधुरापद्गतोपि सन्  ।
      कर्पूरोपावकस्प्रुष्टोसौरभं लभते इतरम् ।।
      
      స్వభావం న జహాత్యేవ సాధురాపద్గతోపి సన్ ।
      కర్పూరోపావకస్పృష్టోసౌరభం లభతేతరం ।।

    (కర్పూరానికి నిప్పు తగిలినంతనే అది తన స్వాభావిక సిద్ధమైన సువాసనని కోల్పోదు సరి కదా, తన సువాసనలని మరింత ఎక్కువగా ఆ ప్రదేశమంతా విస్తరింపజేస్తుంది. అదే విధముగా మంచి వారు కూడా తమ స్వభావ సిద్ధమైన మంచితనాన్ని, సహాయ ప్రకృతిని వారికి ఆపద కలిగినంత మాత్రాన వదలిపెట్టరు. అట్టి వారు ఎల్లప్పుడూ, పరులకు ఉపయోగ కారకులుగానే ఉంటారు.)

    -- నరసింహ సుభాషితం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి