కోతికొమ్మంచి
ఫిబ్రవరి 01, 2024
కోతికొమ్మంచి (kōti-kommanchi)
అర్థము
(విశేష్యము): కోతి+కొమ్మ+అనుచు; పిల్లల ఆట; కొమ్మలమీద ఉంటూ కింద ఉన్న కర్ర లాక్కోవడం; కర్ర కాపలాదారు ముట్టుకుంటే వాళ్ళు కిందకి రావాలి
Meaning
(noun) : children's game played on trees
వాడుక / Usage
ఎండాకాలం సెలవులు అంటే కోతికొమ్మంచి ఆడాలి, అమ్మ చేత దెబ్బలు తినాలి. Summer holidays are incomplete without monkeying on trees and being disciplined by mom.
మెదడుకు మేత / Food for thought
रत्नैर्महार्हैस्तुतुषुर्न देवा न भेजिरे भीमविषेण भीतिम् ।
सुधां विना न प्रययुर्विरामं न निश्चिदार्थाद्विरमन्ति धीराः ॥
రత్నైర్మహాబ్ధే స్తుతుషుర్న దేవా న భేజిరే భీమ విషేణ భీతిం ।
సుధాం వినా న ప్రయయుర్విరామం న నిశ్చితార్ధాద్విరమంతి ధీరాః ॥
(క్షీర సాగర మథనం జరిగేటప్పుడు మొట్టమొదట ఎంతో విలువైన రత్నాలు, మణులు వెలువడ్డాయి. వాటికి పొంగి పోయి ఆపలేదు దేవతలు. భయంకరమైన హాలాహలం బయటకు వచ్చింది, అయినా కూడా భీతి చెందకుండా తిరిగి సాగర మథనం కొనసాగించారు. అమృతం వచ్చేంత వరకూ విశ్రాంతి తీసుకోకుండా చివరకు అమృతాన్ని సాధించారు. అలాగే కార్య సాధకులు కూడా తాము మొదలు పెట్టిన కార్యానికి ఆశించిన ఫలితం వచ్చేంత వరకూ ఎన్ని కష్ట సుఖాలు కలిగినా ప్రలోభ పడకుండా విజయం సాధిస్తారు)
-- నీతిశతకం, భర్తృహరి
Comments
Post a Comment