తస్సదియ్య
జనవరి 10, 2024
తస్సదియ్య (tassadiyya)
అర్థము
(అవ్యయము): తస్స=కొవ్వు లేక చెడ్డ మాంసం; కొవ్వు తీయడం; ఊత పదంగా వాడుకలో ఉంది
Meaning
(participle/interjection) : take bad (proud) flesh (vanity) off; used as exclamation
వాడుక / Usage
బియ్యం మింగలేక వంటబొగ్గులు కొందుమంటే తస్సదియ్య బొగ్గు బస్తా పాతికరూపాయిలంటా! Unable to eat raw rice went to buy coals but damn it, a sack costs 25 rupees!
మెదడుకు మేత / Food for thought
యామినీ శిరోజ దీప్తజ్వాలా కుసుమాలు
తేజోతల్పంపై వ్రాలి అదృశ్యమైనయ్
రవి కిరణాంగుళీనఖక్షతాలతో
శ్యామలాకాశం కందింది
అరుణాచల వామభాగాన
కుంకుమపూజ జరుగుతుంది
తేజోతల్పంపై వ్రాలి అదృశ్యమైనయ్
రవి కిరణాంగుళీనఖక్షతాలతో
శ్యామలాకాశం కందింది
అరుణాచల వామభాగాన
కుంకుమపూజ జరుగుతుంది
– సుధ, చలం (మే 18, 1894 - 1979)
Comments
Post a Comment