జాణ
ఫిబ్రవరి 22, 2024
జాణ (jāna)
అర్థము
(విశేష్యము): నేర్పరి; సమర్థురాలు; రసికులు
Meaning
(noun) : clever person; damsel; shrewd
వాడుక / Usage
జావళీలు పాడే జాణ జాబిలమ్మ తానై గుండె నిండిపోయే చానా.
Moon the belle was and heart she filled with her soulful ballad .
మెదడుకు మేత / Food for thought
స్త్రీ జీవితంలో గృహిణీత్వం – పౌరసత్వం ఈ రెండింటి మధ్య వచ్చే ఘర్షణ గురించి రాసిన నవల ‘స్వేచ్ఛ’. ఇది ఆంధ్రదేశమంతా విపరీతంగా చర్చించబడింది. సమాజం కోసం కుటుంబాన్ని ఒదిలివేయటమనేది ఇప్పటికీ మింగుడుపడని వ్యవహారంగానే ఉండటం నన్ను ఆశ్చర్యపరచింది. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే సామాన్య పాఠకులు ఆ ననవలలోని కథా నాయిక అరుణ వేదనను సరిగానే అర్థం చేసుకున్నారు. కానీ ఉద్యమాలలో , రాజకీయాలలో పనిచేసేవారు మాత్రం అరుణను అతిగా ప్రవర్తించిందని విమర్శించారు. చాల మంచివాడైన భర్తను – ఏ దుర్గుణమూ లేని భర్తను ఏదో చిన్న సంఘంలో పనిచేయటం కోసం ఒదిలిపెట్టటం వారికి మింగుడుపడలేదు. ఆ నవలలో అరుణ పనిచేస్తున్న సంఘం వారికి కూడా నచ్చలేదు. కుటుంబ విచ్ఛిత్తిగానే దాన్ని చూశారు గానీ అరుణ తన పౌరసత్వం కోసం గృహిణీత్వాన్ని ఒదులుకుందనీ అనేక ఉద్యమాలలో అనేకమంది స్త్రీలు ఇలాంటి ఘర్షణ అనుభవించి గృహిణీత్వాలను ఒదులుకున్నారనీ వాళ్ళు గుర్తించలేకపోయారు.-- ఓల్గా
స్త్రీ జీవితంలో గృహిణీత్వం – పౌరసత్వం ఈ రెండింటి మధ్య వచ్చే ఘర్షణ గురించి రాసిన నవల ‘స్వేచ్ఛ’. ఇది ఆంధ్రదేశమంతా విపరీతంగా చర్చించబడింది. సమాజం కోసం కుటుంబాన్ని ఒదిలివేయటమనేది ఇప్పటికీ మింగుడుపడని వ్యవహారంగానే ఉండటం నన్ను ఆశ్చర్యపరచింది. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే సామాన్య పాఠకులు ఆ ననవలలోని కథా నాయిక అరుణ వేదనను సరిగానే అర్థం చేసుకున్నారు. కానీ ఉద్యమాలలో , రాజకీయాలలో పనిచేసేవారు మాత్రం అరుణను అతిగా ప్రవర్తించిందని విమర్శించారు. చాల మంచివాడైన భర్తను – ఏ దుర్గుణమూ లేని భర్తను ఏదో చిన్న సంఘంలో పనిచేయటం కోసం ఒదిలిపెట్టటం వారికి మింగుడుపడలేదు. ఆ నవలలో అరుణ పనిచేస్తున్న సంఘం వారికి కూడా నచ్చలేదు. కుటుంబ విచ్ఛిత్తిగానే దాన్ని చూశారు గానీ అరుణ తన పౌరసత్వం కోసం గృహిణీత్వాన్ని ఒదులుకుందనీ అనేక ఉద్యమాలలో అనేకమంది స్త్రీలు ఇలాంటి ఘర్షణ అనుభవించి గృహిణీత్వాలను ఒదులుకున్నారనీ వాళ్ళు గుర్తించలేకపోయారు.
-- ఓల్గా
Comments
Post a Comment