రాజిల్లు

 

ఫిబ్రవరి 26, 2024

రాజిల్లు  (rājillu)

   అర్థము

    (క్రియ): ప్రకాశించు

  Meaning

   (verb) : to shine

   వాడుక / Usage

    "రంగు బంగారు గంగా తరంగాల రాజిల్లు కాశీవిశ్వేశ్వర." - తోలేటి
    Visweswara you shine in the golden hues of the waves of Ganga at Kasi.

   మెదడుకు మేత / Food for thought

నింగి నేల పొద్దుల్లో నీకు నాకు ముద్దంట
కొండ కోన సందుల్లో పండేనంట గోరింట
వెలుతురు పిట్టలు వేణువులూదిన వేళ
ఊపిరి గోపిక ఊయలలూగిన వేళ
ఏలేలో… ఎదమీద ఎదబెట్టుకోనా?
ఎన్నెన్నో … పొదరిళ్లు నేనల్లనా!

కనులలో నీ పాప నేనల్లె చిటికెలేసిన వేళ
కలుసుకో ఈ రేయి గాలులతో కబురు చేసిన వాడా
చిలిపిరి చిచ్చుల సీతంగి
గుండెల్లో అగ్గేస్తే
తపనలు తీరక వేసంగి
పొదలే మరిగె
సందెలు కందిన చీకట్లో
బుగ్గమ్మే మొగ్గేస్తే
ఎర్రగ వలపె పండాల
నీ జంటలో!
ఓలమ్మో! శకునాలు చలి మంటలాయె
ఓరయ్యో! పరువాలు జడగంటలై

చిలిపిగా శ్రీదేవి జాబిల్లి జలదరించిన వేళ
మసకలో నీ మల్లె పువ్వుల్లో మనసు రేగిన వేళ
పిచ్చుక గూళ్ళకు మొగ్గేసే నవ్వుల్తో నువ్వొస్తే
వాకిలి తీసిన వయ్యారం ఒడితో పిలిచె
అతడు: మామిడి పిందెలు మాటాడె మువ్వల్తో నువ్వొస్తే
కోయిల నెమలై ఆటాడే నీ నీడలో!
ఓరయ్యో! పెదవెత్తి పెదవంటు కోనా?
ఓలమ్మో! ఎదురొచ్చి ఇక వెళ్ళకు!


-- రాజేశ్వరీ కళ్యాణం, వేటూరి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి