శైలము

 

ఫిబ్రవరి 29, 2024

శైలము  (ṣailamu)

   అర్థము

    (విశేష్యము): కొండ; రాయి; భూమిలో ఉండే ధాతువులలో ఒకటి - రసాంజనము

  Meaning

   (noun) : mountain; stone; vitriol of copper - copper sulphate

   వాడుక / Usage

    "భూలోక కైలాస శైలాన వసియించు శ్రీకాళహస్తీశ్వరా." - తోలేటి
    One who presides on the hill that is Kailasa on earth - Sri Kalahasteeswara.

   మెదడుకు మేత / Food for thought

తోలుతిత్తి ఇది తూటులు తొమ్మిది
తుస్సుమనుట ఖాయం
ఓ జీవా తెలుసుకో అపాయం
ఉబ్బుతబ్బులై ఉరుకులు తీయకు
గబ్బుమేను జీవా అవును గబ్బిలాయి జీవా
ఎంతచెప్పినా ఏమిచెప్పినా
కట్టెలపాలౌ పాడు కట్టెరా
మూడురోజులా ముచ్చటరా ఈ చింతకట్టె దేహం
కాయం బుగులిపోవు ఖాయం
నువు కట్టుకుపోయేదొట్టిదిరా
ఈ మట్టినిపుట్టి మట్టిన కలిసే
వెలుతురుండగా తెరువు చూసుకో
తలచి రామనామం
జీవా చేరు రంగధామం పట్టుబట్టి
ఈ లోకపు గుట్టూ రట్టు చేసే
ఈ రంగదాసుడూ 

-- పాండురంగ మహత్యం, సముద్రాల జూనియర్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి