కేళి

 

మార్చి 01, 2024

కేళి  (kēḷi)

   అర్థము

    (విశేష్యము): ఆట; ప్రియునితో నాయిక యొక్క క్రీడ; స్త్రీపురుషుల శృంగార చేష్ట; పరిహాసం

  Meaning

   (noun) : amusement; play; amorous sport

   వాడుక / Usage

    "నీలి మేఘాల కేళీ వినోదాలలో దేలు శ్రీశైల మల్లేశ్వరా! .." - తోలేటి
    One who levitates on the blue cloud kissed peaks of Sri Sailam.

   మెదడుకు మేత / Food for thought

కొత్తా దేవుడండీ కొంగొత్తా దేవుడండీ
ఇతడే దిక్కని మొక్కని వాడికి
దిక్కు మొక్కు లేదండండీ
బాబు రాండీ రాండీ శిశువా

నేలకు సొరగం దించాడండీ
దించిన సొరగం పంచాడండీ
నెత్తిన చేతులు పెడతాడండీ
నెత్తినెట్టుకొని ఊరేగండీ

అందరినీ రక్షించేస్తాం
అందాలన్నీ రాసిచ్చేస్తాం
శృంగారంలో ముంచీ తేల్చీ
బంగారంలో పాతేయిస్తాం
వీరే మీకు సమస్తా
వీరికే మీ నమస్తా
దుష్ట రక్షణం శిష్ట శిక్షణం
చేసేయ్ చేసెయ్
మోసేయ్ మోసెయ్

అప్పులు గొప్పగ చెయ్యొచ్చండి
అసలుకు ఎసరే పెట్టచ్చండి
పీపాలెన్నో తాగొచ్చండి
పాపాలెన్నో చేయొచ్చండి
పాత దేవుడు పట్టిన తప్పులు
ఒప్పులకుప్పులు చేస్తాడండీ
కొత్త దేవుని కొలిచిన వారికి
కొక్కొక్కొ కొదవే లేదండీ

-- రాజాధిరాజు, వేటూరి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి