అర్మిలి

 

ఫిబ్రవరి 06, 2024

అర్మిలి   (armili)

   అర్థము

    (విశేష్యము): అపేక్ష; ప్రేమ; వాత్సల్యము

  Meaning

   (noun) : desire; fondness; affection

   వాడుక / Usage

    కర్మమే కర్తయైతే కడకు మోక్షము లేదు అర్మిలి జీవుఁడు గర్తయైతేఁ బుట్టుగే లేదు.
    If the fruit of action is the doer, there is no liberation in the end; if the attached Atma is the doer then birth there is not.

   మెదడుకు మేత / Food for thought

    ఎక్కడికో హడావుడిగా పరుగులెత్తే కాలవ
    తన నీడల్ని తనతో రమ్మని చెయ్యట్టుక లాగుతోంది
    రామంటూ అవి తలలాడిస్తున్నాయి.
    ఇవాళ ప్రపంచమంతా
    ప్రయాణసంరంభంలో ఉన్నట్లుంది.
    పైని మబ్బుతునకలు
    గుంపులు గుంపులుగా ఎక్కడికో ఎగిరిపోతున్నాయి.
    కింద కాలవగట్టు మీద
    తొందరలేని నీడలా
    ధృఢంగా నేనొక్కణ్ణే!

    -- మృత్యు వృక్షం, ఇస్మాయిల్ (మే 26, 1928 - 2003)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ