పరగు

 

ఫిబ్రవరి 08, 2024

పరగు   (paragu)

   అర్థము

    (క్రియ): ప్రసరించు; ప్రసిద్ధమవ్వు; ప్రవహించు; వ్యాపించు

  Meaning

   (verb) : to spread/flow/shine/be known

   వాడుక / Usage

    పలుశ్రుతులు గర్తలై పరగితే మేర లేదు అల బట్టబయలు గర్తైతే నాధారము లేదు.
    If the Vedas shine as the doer, there is no bound to it; if the wide world is the doer there is no substratum.

   మెదడుకు మేత / Food for thought

కోరిక సుడిగాలై పాకింది నరాలలో
విజయుడి బహుమతి కైవసం చేసుకున్న తొలి రేయిలో.
అపుడేమైంది పాంచాలీ జగన్మోహినన్న నీ గర్వానికి
నేనూ విజేతనే తెర మరుగున అన్న ఆ మగతనానికి?
ఊపిరిసల్పనీయలేదా నిన్ను పశ్చాత్తాపం లేని బాహువులతో
నైపుణ్యంగా తానే గెలుచుకున్నట్లు నిన్ను, స్వహస్తాలతో?
నీ హొయలలో మోహం మాటు అయ్యిందా
అతని క్రింద నీ నడుము ఒలలూగినప్పుడు?
ఆ కేళిలో, వాడి వేడిలో చలించి అకస్మాత్తుగా
సెగలు బూడిదై, నిట్టూర్పుతో అతను కృంగిపోగా
యవ్వన సంభోగలోలమైన నీ ఓజస్సులో
సుఖభంగాన్ని కప్పిబుచ్చే సంయమనం దాగిందా?
గదాధారుడు కాదు, ధనుష్టంకారం చేయలేడు
కానీ యెనలేని అహంకారాన్ని త్యజించలేని ధీరుడాతడు.

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి