సందోహము
ఫిబ్రవరి 28, 2024
సందోహము (sandōhamu)
అర్థము
(విశేష్యము): సమూహము; గుంపు
Meaning
(noun) : assembly; multitude
వాడుక / Usage
"దివ్య ఫల పుష్ప సందోహ బృందార్చితానంద." - తోలేటి
Exuberant, worshipped by multitudes of divine fruits, flowers and tulasi.
మెదడుకు మేత / Food for thought
దేవుడు ఉన్నాడో లేడో
మానవుడున్నాడురా
వాడే దేవుడు కలడో లేడని
తికమకపడుతున్నాడురా (2)
మానవుడున్నంత వరకు దేవుడు ఉంటాడురా (2)
వాడిని తలచేందుకు మానవుడుండాలిరా
తనలో మంచిని పెంచుకొనేటందుకు
తానే దేవుడు అయ్యేటందుకు
మనిషొక రూపం కల్పించాడు
అది మనిషి మనిషికొక రూపమయి
పలు మతాలుగా మారాయిరా
భయం నుంచి దేవుడు పుట్టాడు
భక్తి నుంచి దైవత్వం పుట్టింది
భయం భక్తులను మించిన స్థితినే ముక్తి అంటారురా
ముక్తి అంటారురా
మనిషికోసం బ్రతికే మనిషే దేవుడు
దేవుడికోసం మనిషిని మరిచే వాడే మూడుడు
ప్రేమ, త్యాగం
ప్రేమ, త్యాగం తెలిసినవాడే మానవుడు
దేవుడి పేరిట మూడుడైతే వాడే దానవుడు
వాడే దానవుడు
మానవుడున్నాడురా
వాడే దేవుడు కలడో లేడని
తికమకపడుతున్నాడురా (2)
మానవుడున్నంత వరకు దేవుడు ఉంటాడురా (2)
వాడిని తలచేందుకు మానవుడుండాలిరా
తనలో మంచిని పెంచుకొనేటందుకు
తానే దేవుడు అయ్యేటందుకు
మనిషొక రూపం కల్పించాడు
అది మనిషి మనిషికొక రూపమయి
పలు మతాలుగా మారాయిరా
భయం నుంచి దేవుడు పుట్టాడు
భక్తి నుంచి దైవత్వం పుట్టింది
భయం భక్తులను మించిన స్థితినే ముక్తి అంటారురా
ముక్తి అంటారురా
మనిషికోసం బ్రతికే మనిషే దేవుడు
దేవుడికోసం మనిషిని మరిచే వాడే మూడుడు
ప్రేమ, త్యాగం
ప్రేమ, త్యాగం తెలిసినవాడే మానవుడు
దేవుడి పేరిట మూడుడైతే వాడే దానవుడు
వాడే దానవుడు
-- మేమూ మీలాంటి మనుషులమే, ఆత్రేయ
Comments
Post a Comment