తామ్రము

 

ఏప్రిల్ 01, 2024

తామ్రము  (tāmramu)

   అర్థము

    (విశేష్యము/విశేషణము): రాగి; ఎరుపు; ఎర్రనిది

  Meaning

   (noun/adj) : copper; red; redness

   వాడుక / Usage

    శ్రీశైలం పంచ మఠాల్లో ఒకటైన ఘంటా మఠం పనుల్లో పలు తామ్ర పత్రాలు లభ్యమయ్యాయి.
    Copper plate inscriptions have been unearthed in Srisailam mutt renovations.

   మెదడుకు మేత / Food for thought

    మనసా నందమా నంద మాయే

    కడతేరగా గగనాన ఘనాంధకారం

    విప్పారిన కనుల సూరీడాయే

    మనసా నందమా నంద మాయే


    ఎగిసే అలల అందాల కిరణాలు

    గంగమ్మ ఒడిలోని పవిత్ర జలాలు

    అర్పించు వేళ ప్రతి సింగారం తేనెలొలుకు

    సింధూర గీతమై పాడెనే

    మనసా నందమా నంద మాయే


    మనసున పేరుకున్న పుట్టెడంత చింతలు

    కరిగి కన్నీళ్ళై చేతిన వర్షించగా

    అశృతుషారాలతో బిక్కు బిక్కు నున్న

    ప్రతి రోమము రొమ్ము విప్పి నవ్వేనే

    మనసా నందమా నంద మాయే


    మానస సరోవరం కల్లోల మగ్నం

    నవదర్పణం తొంగి చూడగా

    పాశం నాశం లేనిదై అర్థనిమీలిత నేత్రాలతో

    ప్రాణ హంస తరలి వచ్చెనే

    మనసా నందమా నంద మాయే

    -- 'మన్ ఆనంద్ ఆనంద్ ఛాయో' పాటకి స్వేచ్ఛానువాదం...

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి