రయము

 

మార్చి 29, 2024

రయము  (rayamu)

   అర్థము

    (విశేష్యము): వేగం; (నదీ) ప్రవాహం

  Meaning

   (noun) : speed; fast flowing water

   వాడుక / Usage

    చేసి చేసి అవినీతి కార్యముల్ కొనుడి కొనుడి ఎన్నికల బాండ్లు రయముగాను.
    Indulge in malpractices galore, invest in electoral bonds at gallop.

   మెదడుకు మేత / Food for thought

    ఎర్లీ మార్నింగులో నిద్ర లేవంగనే
    పాచి పళ్ళైనయున్ తోమకన్ త్రాగు బెడ్ కాఫీ
    కోసంబు పెండ్లాముపై రంకెలేయించకే బెస్టు టేస్టీశ్వరీ..

    ఫ్రెష్షు కాఫీశ్వరీ నెస్సు కేఫీశ్వరీ జిహ్వకున్
    సిద్ధి చేకూర్చవే బ్రూకు బాండేశ్వరీ...
    లోక ప్రాణేశ్వరి ప్రాణ దానేశ్వరి గంటగంటా
    ప్రతీ ఇంట ఉప్పొంగవే ఉష్ణ పానేశ్వరీ..

    స్టీలు ఫిల్టర్ల పళ్ళెంబులోనున్న రంధ్రాలలో నుండి
    నీ సారమంతా సుతారంగా జారంగ నోరూర
    చూడంగ నా సామిరంగా నిజంగానె చచ్చేవిధంగా..
    కాస్త తాగన్ పునర్జన్మ వచ్చే విధంగా..

    -- మిథునం, జొన్నవిత్తుల

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి