కరవాలము

 

మార్చి 05, 2024

కరవాలము  (karavālamu)

   అర్థము

    (విశేష్యము): ఖడ్గము; కత్తి

  Meaning

   (noun) : a sword

   వాడుక / Usage

    "సమాజంలో సాగిన జబర్దస్తీల మీద కలాన్ని కరవాలంలా తిప్పిన వీరుడు (రావిశాస్త్రి)" - ఖదీర్ 
    Raavisastri was a hero who wielded his pen like a sword against the injustices in society.

   మెదడుకు మేత / Food for thought

అంత గొప్ప ప్రవాహంలో సంతత ధారగా వాన పడిపోతోంది. నీళ్లలో నీళ్లు. ధారలో ధార. వాన చినుకులు కృష్ణలో పడుతుంటే పెద్దక్క ప్రేమగా హత్తుకుంటే వొళ్ళు జలదరించినట్లు ఆ ప్రవాహం మీద ఒక జలదరింపు. సిగ్గుతో నవ్వినప్పుడు బుగ్గ మీద సొట్టలా చినుకు పడ్డ చోట చిన్న గుంట. అంతలో మాయమై మళ్ళీ మళ్ళీ గుంటలు. కృష్ణంతా పులకరింతలు. ఇసక మీద చినుకులు. కసకస చినుకులు. విసవిస సరసర చినుకులు. రివ్వుమని రయ్యమని చినుకులు. ఛళ్లుమని ఫెళ్ళుమని దభిల్లుమని పెఠిళ్లుమని చినుకులు. కృష్ణ నిండా, ఇసక నిండా, నేల నిండా - రెండు గంగలు కలిసిపోయినట్లు నింగి నేల ఒకటైనట్లు. ఈ జగత్తులో నీళ్లు తప్ప ఇంకేవీ లేనట్లు అన్నిటికీ నీళ్ళే ఆధారమన్నట్లు వాన, వర్షం, గంగమ్మ, కిష్టమ్మ, సంద్రం - అదేదో దానికి నువ్వేపేరైనా పెట్టుకో. 

-- రెండు గంగలు (1977), సత్యం శంకరమంచి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి