ఆపుకోరా
మార్చి 27, 2024
ఆపుకోరా (aapukora)
అర్థము
(విశేష్యము): నీటి పాత్ర; ఉర్దూ అబ్ (నీరు) ఖోర్ (త్రాగు) నుంచి; కింద లావుగా పైకి పోను పోను సన్నంగా ఉండి పెదవులు వంపు తిరిగి ఉన్న చెంబు
Meaning
(noun) : tumbler
వాడుక / Usage
ఒకప్పుడు గ్రామాల్లో విందుకి ఎవరి ఆపుకోరా వాళ్ళు తెచ్చుకునేవాళ్ళు.పెళ్ళిల్లలో ప్లాస్టిక్ బాటిల్ తగ్గాలంటే అదే చేయాలేమో!
People used to carry their own tumblers to feasts. May be that's the solution to plastic bottles in weddings.
మెదడుకు మేత / Food for thought
చిత్తంబునున్నట్టి శివుని గాంచగలేక
గుడిగోపురంబులంచు దిరుగనేల?
వెఱ్ఱి వగుచు నీవు వెతల జెందగనేల?
మంచి మాట వినుర మానవుండ!
ఎక్కువ ధనమున్న, ఎట్లుగాతునను ఏడ్పు,
లేకయున్న, ధనము లేదనేడ్పు
ఏడ్పులేని మనుజులెందును లేరురా
మంచి మాట వినుర మానవుండ!
-- శ్రీమతి కామేశ్వరమ్మ
Comments
Post a Comment