ముక్తాయించు

 

మార్చి 08, 2024

ముక్తాయించు  (mukthayinchu)

   అర్థము

    (క్రియ): పూర్తి చేయు; ముగించు 

  Meaning

   (verb) : finish; conclude (a sentence/thought) 

   వాడుక / Usage

    "'ఔనండి... ఎన్నాళ్ళయింది ఇలాంటి వానపడి..' అని ముక్తాయించాడు" - అద్దేపల్లి ప్రభు 
    "Yes sir...it has been long since it has rained like this" he concluded.

   మెదడుకు మేత / Food for thought

యెప్పుడో ఒకప్పుడు అంతా ఒంటరితనంలో కొట్టుకుపోతూనే ఉంటాం. ఆ దిగులు, బెంగ యెందుకో తెలిసినా మనం మన ఇష్టాలని, కోరికలని, ప్రేమలని నిర్భయంగా, స్వేచ్ఛగా వ్యక్తపరిచే స్థితి మన చుట్టూ లేదుకదా. యెవ్వరి లైఫ్ స్టైల్ వాళ్ళది అనుకోరు కదా! మనముందు వో వ్యవస్థని ఉంచారు. మనక్కి ఇరుగ్గా ఉన్నా అందులోనే ఉండాలా? బయటకి రావాలా? బయటికి వస్తే మనమీద విసిరే బాణాలని మనం యెదుర్కోగలమా...మన చుట్టూ వున్న గోడలని మనం బద్దలు కొట్టగలమా...అసలు కొట్టాలా వద్దా..కొట్టటం వల్ల మనకి కావాల్సింది మనకి దొరుకుతుందా...లోపల యేమి లేదని తెల్సింది. బయట ఏముందో లేదో తేల్చుకోటానికి యెందుకు వెనుకాడాలి?

-- గోడ (1999), కుప్పిలి పద్మ 

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి