ఉపశమనము

 

మార్చి 06, 2024

ఉపశమనము  (upa-ṣamanamu)

   అర్థము

    (విశేష్యము): శాంతి; ఓర్పు; ఓదార్పు

  Meaning

   (noun) : calmness; tranquillity; patience; relief (from pain/sorrow) 

   వాడుక / Usage

    "అనంతపురపు అంతులేని జీవన వేదన ఈ రచయిత (బండి నారాయణ స్వామి) కథల్లో చోటు చేసుకుని కొద్దోగొప్పో ఉపశమనం పొందగలిగింది " - ఖదీర్ 
    Anantpur's life struggles got some relief in this writer's stories.

   మెదడుకు మేత / Food for thought

తెల్లవారింది. నదులు ఎప్పటిలాగే తుళ్లుకుంటూ పరుగులు తీస్తూనే ఉన్నాయి. ఎండిన చోట వాన పడి తిరిగి ప్రాణం పోసుకుంటూనే ఉన్నాయి. సముద్రాలు ఆదిమ ఆజ్ఞకు లోబడి చెలియలికట్ట దాటకుండా వెనక్కు మరలుతూనే ఉన్నాయి. అవి పొర్లివచ్చిన చోట కూడా ఒక తల్లి ఎంతో సురక్షితంగా చోటు చూసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చింది. తగలబడిన అరణ్యాలలో ఆ రాత్రి రహస్యంగా కొన్ని తీగలు కొత్త చిగుళ్లు తొడిగి అవి పాకిన చెట్లను మరింత బలంగా పెనవేసుకున్నాయి. ఈ సృష్టిలోని అనంత చైతన్యం తనకు కావలసిన సమస్తాన్ని యథాతథంగా ప్రాణప్రదంగా కాపాడుకుని ఆ ఉదయం మళ్ళీ నిద్రలేపింది. అతడూ నిద్ర లేచాడు.

-- ఒక సాయంత్రపు అదృష్టం (2010), మహమ్మద్ ఖదీర్ బాబు

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి