మడక

 

మార్చి 07, 2024

మడక  (maḍaka)

   అర్థము

    (విశేష్యము): నాగటికి ఎడ్లను పూన్చిన అరక; స్థలం; పరిసరం; నాగలి 

  Meaning

   (noun) : plough with bullocks yoked; place; surroundings; plough 

   వాడుక / Usage

    "నాయనా! మద్దినేళ మడకలిప్పే పొద్దులో పెళయకావేట్లో నడవబాకండ్రా" - స. వెం. రమేశ్ 
    Dear son! Don't walk in Pulicat lake in the afternoon around the time bullocks are unyoked from ploughs.

   మెదడుకు మేత / Food for thought

అంతా విన్న కుమ్మరోళ్ల రమణన్న లేచి 'అయ్యా! సుధాకరయ్య...ఆ పంటరంగ సామే మీ బిడ్డల్ని కాపాడినాడు. రెట్టమూల్లో ఇన్ని తరంతాలుగా నరమానవుడునట్లు ఎరగం. ఆ సోమే పెద్దాయన మాదిరి వొచ్చి బిడ్డల్ని ఉత్తరపొద్దు నించి కాపాడినాడు. శివురేత్తిరికి కూటిపొరువు (అన్నదానం) జేస్తానని మొక్కు' అన్నాడు. మా మామ పంటరంగం వైపు తిరిగి చేతులెత్తి మొక్కి, మమ్మల్ని గట్టిగా గుండెల కదుముకున్నాడు. ప్రళయ కావేరమ్మతో కూడడానికి సూరయ్య చరచరా పైకి లేస్తున్నాడు.

-- ఉత్తరపొద్దు (2003), స. వెం. రమేశ్ 

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి