కాంచి

 

ఏప్రిల్ 03, 2024

కాంచి  (kānchi)

   అర్థము

    (విశేష్యము): స్త్రీలు ధరించే ఒంటిపేట మొలనూలు; వడ్డాణం

  Meaning

   (noun) : woman's girdle

   వాడుక / Usage

    రుండమాలాకాంచి ధరించి భీకరంగా ఉన్న శూర్పణఖని చూసిన జానకి భయవిహ్వలమయ్యింది.
    Seeing Soorpanakha adorned with a girdle of skulls Sita froze with fear.

   మెదడుకు మేత / Food for thought

    "విషాన్ని విషంగా  గుర్తించడానికి ఇష్టపడని వాళ్ళకి అది విషం అని చెప్పడం వృధా." నార్వేకి చెందిన నాటకాల రచయిత హెన్రిక్ ఇబ్సెన్ 1882 లో రచించిన నాటిక "యాన్ ఎనిమి అఫ్ ది పీపుల్ " ని పంతొమ్మిది వందల అరవైల్లో గొల్లపూడి మారుతీ రావుగారు తెలుగు రంగస్థలం కోసం "సత్యంగారిల్లెక్కడ" గా అనువర్తించారు. సత్యజిత్ రాయ్ ఇబ్సెన్ నాటికని ఘనశత్రు పేరుతో 1990 లో సినిమాగా తీశారు. గొల్లపూడి గారి నాటికని ఈరోజు మళ్ళీ చదివాను. ఆ నాటికలో ముఖ్య పాత్ర అయిన డా:సత్యం సత్యం కోసం తన జీవితం మొత్తం పణంగా పెట్టి అన్నీ కోల్పోతాడు. అతని ఆవేదనని మారుతీ గారు పై పదాలలో మనకి చెప్పించారు. ఈ నాటిక ఈనాటికి ఏనాటికి అయినా అద్దం పడుతుంది. కుట్రలు కుతంత్రాలు తో మకిల పడిన సమాజం , దానిని తమ స్వప్రయోజనాల కోసం వంచించే రాజకీయ నాయకులు, అజ్ఞానంతో తోలు బొమ్మల లాగా వాళ్ళ చేతిలో ఆయుధాలు అయ్యే అమాయక ప్రజలు, వీళ్లందరి నడుమ సత్యం కోసం నిలబడిన డాక్టర్ సత్యం ఈ నాటిక కథాంశం.

-- "సత్యంగారిల్లెక్కడ?" నాటకం గురించి 

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి