తాకిడి
ఏప్రిల్ 15, 2024
తాకిడి (taakidi)
అర్థము
(విశేష్యము): స్పర్శ; ఒత్తిడి
Meaning
(noun) : touch; pressure; trouble; pain
వాడుక / Usage
ఎద లోయల్లోన సాగింది కొత్త తాకిడి తనువంతా వేణువూదింది కన్నె ఊపిరి.
In the depths of my heart there is a sweet pain, my body resonates with nubile sighs.
మెదడుకు మేత / Food for thought
కిమస్థిమాలాం కిము కౌస్తుభం వా
పరిష్క్రియాయాం బహుమన్యసే త్వం?
కిం కాలకూటః కిము వా యశోదా
స్తన్యం తవ స్వాదు వద ప్రభో మే!
పరిష్క్రియాయాం బహుమన్యసే త్వం?
కిం కాలకూటః కిము వా యశోదా
స్తన్యం తవ స్వాదు వద ప్రభో మే!
(భగవంతుడికి ఎముకల దండ అంటే ఇష్టమా? కౌస్తుభమణి అంటే ఇష్టమా? కాలకూటవిషం రుచా? లేక యశోదా చనుబాలు తీపా? ఇదీ ప్రశ్న. తేడాలున్నది వస్తువులలో కాదు, వస్తువులను చూసే దృష్టిలో. ఒక వ్యక్తి తలచుకుంటే, మణిమరకతమాణిక్యాల వంటి ఐశ్వర్యం నడుమ ఎంత ఆనందంగా ఉండగలడో, స్మశానంలో, బూడిద పూసుకుని ఎముకల దండలు ధరించి కూడా అంత సంతృప్తిగా ఉండగలడు. ఎందుకంటే ఐశ్వర్యంతో తుల తూగుతున్నదీ దేవుడే. ఎముకల దండను ధరించిందీ భగవంతుడే.)
-- తిక్కన
Comments
Post a Comment